దర్శి మండల సర్వసభ్య సమావేశానికి గెర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచిం
చారు. దర్శి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ జి. సుధా
రాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉండగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హాజరుకాలేదు. అధికారులకు బదులు కిందిస్థాయి ఉద్యోగి రావటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా ఆర్అండ్ అధికారులు సమావేశానికి హాజరుకాకుండా కిందిస్థాయి ఉద్యోగిని పంపారని ఆ రెండు శాఖల అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. సమావేశం ముగిసే సమయంలో చందలూరు పీహెచ్సీ అధికారి సమావేశంలో పాల్గొని తమకు సమాచారం అందలేదని తెలిపారు. అందుకు స్పందించిన జడ్పీ చైర్పర్సన్ అన్నీ శాఖలఅధికారులకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పరిహారం త్వరితగతిన అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హనుమంతరావు, పీఆర్ డీఈ విఠల్ రాథోడ్, వైస్ఎంపీపీలు ఎస్. దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, సీడీపీవో భారతి, ఏవో బాలకృష్ణ నాయక్, ఎంఈవో కె. రఘురామయ్య, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కె. రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
