నిరుపేద విద్యార్థులు విద్యలో
రాణించి పై ఉన్నత స్థాయికి కి చేరటానికి ఏంటి బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ ఆదం షరీఫ్ (బుజ్జి) అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అరుణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శనివారం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సహాయ సహకారాలతో బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదవ తరగతి చదివే విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ ఆదం షరీఫ్ (బుజ్జి) మాట్లాడుతూ ….ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి స్టడీ మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు మెటీరియల్స్ పంపిణీ చేశారు. జిల్లాపరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లకు విద్యార్థులు, సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ టి రాజశేఖర్ రెడ్డి, గ్రామ వైసిపి నాయకులు గుజ్జుల యోగి రెడ్డి, గుజ్జుల తిరుపతిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు నాగిరెడ్డి, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

