తాళ్లూరు మండంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన వేడికోల పెద వెంకట రెడ్డి (49) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ మోహనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు… గ్రామానికి చెందిన వేడికోల పెద వెంకటరెడ్డి గత రెండు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఈనెల 14న పొలం వెళ్లి పని చేస్తుండగా కడుపునొప్పి అధికం కావడం తో నొప్పి భరించలేక పొలం వద్ద ఉన్న గడ్డి మందు తాగాడు. చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేయగా వెంటనే తూర్పుగంగవరంలో ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం ఒంగోలు అక్కడి నుంచి మెరు గైన వైద్యం కోసం గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా మృతుడి తమ్ముడు వేడికోల నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇంటర్ చదువుతున్న కొడుకు, పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు.
నాగంబొట్లపాలెంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
17
Dec