జగన్ పాలనలో రైతు సుభిక్షం -ఐదేళ్ల పాలనలో ఒక్క కరువు మండలం లేదు -ఆర్థిక సంక్షోభం వేధిస్తున్నా రైతులకు అండగా నిలిచారు- వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని రైతులంతా సుభిక్షంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్య క్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్ర బాబు పాలన అంటేనే కరువు అన్నారు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో రాష్ట్రంలో కరువు మండలంలోని సంవత్సరం లేదన్నారు. కానీ జగన్ అయిదేళ్లపాలనలో ఒక్క కరువు మండలం అవసరం కూడా రాలేదని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 55 నెలలపాలనలో 14 నెలలు కోవిడ్ నెలకొందని, ఆ సమయంలో ప్రజానీకాన్ని బతికించుకోవడానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. తాను అధి కారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానని నేడు చంద్రబాబు అంటున్నా రంటే ఇద్దరిలో ఎవరు పరిపాలనా దక్షులో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు గద్దె దిగే సమయా నికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టు మిట్టాడుతున్నా ప్రజల మొహంలో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో పేరుకుపోయిన శనగలకు రూ.1500లు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నారన్నారు. మార్కుఫెడ్ ద్వారా తొలిసారిగా పొగాకు కొనుగోలు చేయించి మార్కెట్ లో పోటీ వాతావరణాన్ని సృష్టించి రైతులను ఆదుకున్నారని చెప్పారు. చివరకు జామాయిల్, సుబాబుల్ ధర క్వింటాలుకు చంద్రబాబు హయాంలో రూ.1800లు కూడా రాలేదని, కానీ నేడు దాని ధర రూ.5 వేల పైగా ఉందన్నారు. రామాయపట్నం పోర్టుకోసం పాదయాత్రలు చేసినా చంద్రబాబు చలించలేదని, కానీ నేడు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పేద రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారన్నారు. తుఫాన్ ల వల్ల పంట నష్టం జరిగితే అదే ఏడాది పంట నష్టపరి హారం అందించడంతోబాటు రైతుకు పంటల బీమా కూడా అందేలా చేశారన్నారు.
చంద్రబాబు హయాంలో 458 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి రూ.5 లక్షలు ఇస్తానన్న చంద్రబాబు పట్టించుకోకపోతే అధికారం లోకి రాగానే సి.ఎం జగన్మోహన్ రెడ్డి పరిహారం మొత్తాన్ని రూ.7 లక్షలకు పెంచి ఆదుకున్నారన్నారు. చం ద్రబాబు రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలను చుక్కల భూములుగా మార్చి (22ఏ) రైతులకు నిద్రపట్టకుండా, చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెస్తే దానిని సరిచేసి రైతుకు భూమిపై హక్కు కల్పించారని చెప్పారు. ఈ విషయాలన్నీ గమనించే ప్రజా నీకం అంతా నేడు మళ్లీ జగనే తమ సీఎం అంటూ పేర్కొంటున్నారని మారెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *