క్రిస్మస్ సందర్భంగా ఒంగోలు నగరంలోని ఏబీఎం గ్రౌండ్లో రెండు రోజులుగా నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. మొత్తం పది టీంలు తలపడ్డాయి. విన్నర్స్ గా రైజీ టీమ్, రన్నర్స్ గా జైలర్ శ్రీనివాసరావు, దేవ్ టీంలు నిలిచాయి.
ముఖ్య అతిథులుగా పీఆర్ ఒంగోలు ఈఈ వై.కోటేశ్వరరావు, ఎస్బీఐ మంగమూరు రోడ్ బ్రాంచి డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్, ఫినో కంపెనీ స్టేట్ హెడ్ కొప్పోలు ఏడుకొండలరావు, డాక్టర్ రాజ్ విమల్ హాజరై విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్ అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రీడాకారులకు పంచి పెట్టారు. సీనియర్ క్రీడాకారులు వై.మల్లి, వై.కృష్ఙారావు, జనార్దన్, పి.మాల్యాద్రి, ఏపూరి, కె.బాలు, నానీ,సతీష్, రెహానా, గ్లోరీ, సౌమ్య పాల్గొన్నారు.
