చీమకుర్తి లోని బూచేపల్లి నివాసంలో ఆదివారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిభ జన కార్యక్రమం కన్నుల పండుగలా జరిగింది. అయ్యప్పస్వామి మాల ధరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఇసుకవాగులోని ‘సాక్షి రామలింగేశ్వరస్వామి’ ఆలయంలో అయ్యప్పస్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఊరేగింపుగా బూచేపల్లి నివాసంలో నిర్వ హించే పడిపూజా భజన ప్రాంగణం వద్దకు తీసు కొచ్చారు. అయ్యప్పస్వామి మెట్లను సుందరంగా అలంకరించి స్వామికి బూచేపల్లి కుటుంబ సభ్యు లతో పాటు భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పడిపూజా భజన కార్యక్రమంలో అయ్యప్పస్వామి భక్తులతో కలిసి బూచేపల్లి వెంకాయమ్మ భక్తిగీతాలను ఆలపించారు. భజన అనంతరం భక్తులకు బిక్షను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బుచేపల్లి శివప్రసాదరెడ్డి సతీమణి బూచేపల్లి నందిని, వారి కుమారుడు, కుమార్తె, కుటుంబ సభ్యులతో పాటు సర్వమాలలు ధరిం చిన భక్తులు పాల్గొన్నారు.


