సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన జనవరి 10, 11 తేదీల్లో దర్శి పట్టణంలోని తమ నివాసం వద్ద నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
దర్శి లోని బూచేపల్లి నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎడ్లపందేల గోడపోస్టర్లను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ల చేతుల మీదుగా ఆవి ష్కరించారు. అనంతరం ఎడ్లపందేలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ ….ప్రపంచం మొత్తం ఒంగోలు జాతి ఎడ్లకు మంచి పేరు ఉందని, అయితే ఒంగోలు ప్రాంతంలో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శనను సంక్రాంతి సం బరాల్లో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరవుతారని చెప్పారు.
న్యూ కేటగిరీ, సీనియర్ కేటగిరీ అనే రెండు కేటగిరీల్లో పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యూ కేటగిరీ ఎడ్లకు 16 క్వింటాళ్ల బండ, సీనియర్ విభాగం ఎడ్లకు 21 క్వింటాళ్ల బండ లాగుతారన్నారు. రెండు కేటగిరీలకు 9 బహుమతులు అంది స్తున్నామని చెప్పారు. న్యూ కేటగిరీ బహుమతులువరుసగా రూ.లక్ష, రూ.80 వేలు, రూ.70 వేలు, రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు ప్రకటించారు. అలాగే సీనియర్ విభాగం ఎడ్లకు బహుమతులు వరుసగా రూ.2 లక్షలు, రూ.1.60 లక్షలు, రూ.1.25 లక్షలు, రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25వేలు, రూ.20 వేలు, రూ.15 వేలుగా ప్రకటించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఎడ్లజతకు కన్సోలేషన్ బహుమతిగా రూ.7 వేలు అంది స్తున్నట్లు తెలిపారు.
పోటీల్లో పాల్గొన దలిచిన వారు సందిరెడ్డి నరేంద్ర రెడ్డి 9966368684, రాజు క్రియేటివ్స్ 9160427437, 9985130929, 6304506020, 9381869924 నంబర్లను సంప్రదించాలనికోరారు. కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎంబాషా, దర్శి ఎంపీపీ సుధాఅచ్చయ్య, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, కురిచేడు, ముండ్ల మూరు జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, టీ రత్న రాజు, సొసైటీ అధ్యక్షులు వేమిరెడ్డి చెన్నారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేవీ రెడ్డి, మాజీ ఎంపీపీలు వీరగంధం కోటయ్య, ఇత్తడి దేవదానం, పోతం మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, ఆవుల శివారెడ్డి, దొనకొండ, ముండ్లమూరు మాజీ మండల కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, దర్శి మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు చింతలపూడి శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.


