బీసీ కుల కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి విధులు కల్పించాలని, చట్టబద్ధతతో కూడిన బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని బీజేపీఓబీసీ మోర్చా అధ్యక్షుడు తానికొండ సురేష్ యాదవ్ కోరారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఒం గోలు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా స్పం దనలో వినతిపత్రం అందించారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి యోగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి శివాజి, తదితరులు పాల్గొన్నారు.

