అయ్యప్పస్వామి దర్శనం కోసం శభరిమలకు వెళుతున్న అయ్యప్ప స్వాముల ద్విచక్ర వాహనాలను మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సీతాఫల్ మండి కి చెందిన అశోక్ సనత్ నగర్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ మూడవసారి గెలుపొందితే తాను బైక్ పై శభరి మలకు వస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. ఇటీవల వెల్లడించిన ఎన్నికల ఫలితాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. దీంతో అశోక్ తన మొక్కును తీర్చుకునేందుకు గాను బైక్ పై శభరి మల యాత్రకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు శైలేందర్, కృష్ణ, సాగర్, జగదీష్, ప్రేమ్, కుమార్ యాదవ్, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

