అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న పీడీ రవికుమార్
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెనూ ప్రకరాం భోజనం అందించాలని డీఆర్డీఏ-వైఎస్సార్ కెపి ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్ ఆదేశించారు. తాళ్లూరు మండలంలోని శివరామపురం అంగన్వాడీ కేం ద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో ఉన్నందున కేంద్రాల నిర్వహణ బాధ్యత గ్రామ సంఘ సహాయకులకు అప్పగించినట్లు పేర్కొ న్నారు. కేంద్రాల్లో సమయ పాలన పాటించి ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత వీఓఏలపై ఉంద న్నారు. గర్భిణులు, బాలింతలకు మంజూరైన పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఉన్నతాధి కారుల ఆదేశాల ప్రకారం బాధ్యతలు నిర్వహిం చాలన్నారు. చిన్నారుల కోసం వండిన ఆహారం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. సచివా లయ మహిళా పోలీస్ పార్వతి, వీఓఏలు అనూ రాధ, జ్యోతి పాల్గొన్నారు.
అంగనవాడీలలో మెనూ ప్రకారం భోజనం అందించాలి -డిఅర్.డి.ఏ పీడీ రవికుమార్
20
Dec