తాళ్లూరులో ఎబీసీ ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్టమస్ వేడుకలుఉత్సాహంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు అధ్యక్షతన సెమిక్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ప్రేమ, కరుణ, దయతో ఏసుప్రభువు ప్రపంచాన్ని జయించారని ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శమని చెప్పారు. నేటి యువత పండుగల విశిష్టతను తెలుసుకోవటవం లేదని చెప్పారు. విశిష్టతను తెలిపేందుకు సెమిక్రిస్టమస్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దైవవాక్యబోధకులు రవి మాట్లాడుతూ.. పాఠశాలలో సెమి క్రిస్టమస్ కార్యక్రమాల నిర్వహణ వలన నేటి తరానికి పండుగ విలువను తెలియజేసే ప్రయత్నం గొప్పదని చెప్పారు. ఆత్మ, జన్యు పరమైన సంబంధాలను తెలిపారు. క్రీస్తు జననం చరిత్ర గురించి వివరించారు. విద్యార్థులకు మంచి నడవడికపై, తల్లిదండ్రులకు తమ సంతానంపై ఉన్న ప్రేమను బొమ్మల కథతో చక్కగా వివరించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…. సమాజంలో జరిగే మంచి చెడుల పట్ల విద్యార్థులు అవగాహనతో ఉండాలని చెప్పారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ తల్లి దండ్రులు కష్టాన్ని విద్యార్థులు గుర్తించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని కోరారు. ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూపరాణి, చిన్నయ్య, బ్యాంకు ఉద్యోగి ప్రగతి, ఫాస్టర్ మోహన్ రావు దైవ వాక్యాన్ని చదివి వినిపించారు. అనంతరం కేక్ ను కట్ చేసారు. విద్యార్థులకు కేక్ లను మిఠాయిలను పంచిపెట్టారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.|



