అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – భిక్షాటన చేసి నిరసన

అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర మాజీ రాష్ట్ర కార్యదర్శి మీగడ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మీగడ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంపై ఉద్యోగ, కార్మికులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోవు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని అన్నారు. అంగన్వాడీల సమ్మెకు జనసేన ఎన్ఆర్ఐ నాయకుడు గరిగపాటి వెంకట్ మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అచ్చమాంబ, అజిత, సందు వెంకటేశ్వరావు, తాండవ రంగారావు, ఆది నారాయణ, అంజిబాబు, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, రత్నకుమారి, ప్రశాంతి, వెంకట రమణలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *