సికింద్రాబాద్ పరిధి లోని సుభాష్ రోడ్డు లో బుధవారం అర్ధరాత్రి డెకరేషన్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. బోయి గూడకు చెందిన రాజేశ్వర రావు గత 70 సంవత్సరాలుగా సుభాష్ రోడ్డు లో వివాహాలకు సంభందించిన అలంకార (డేకరేశన్ షాపు) సామాగ్రిని విక్రయిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు . బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన షాప్ నుండి పొగలు వస్తున్నాయని స్థానికుల నుండి ఫోన్ రాగానే షాప్ వద్దకు వెళ్ళారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే షాప్ లోని దాదాపు 3లక్షల విలువ గల డెకరేషన్ సామగ్రి అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యిందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని రాజేశ్వర్ రావు తన ఆవేదనను వ్యక్తం చేశారు.

