క్రీస్తు ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ మళ్ళీ సీఎంగా ప్రమాణా స్వీకారం చేస్తారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. దర్శి లోని బూచేపల్లి నివాసంలో గురు వారం సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా 600 మందికి పైగా పాస్టర్ దంపతులకు దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ క్రీస్తు గీతాలు ఆలపించి అందిరినీ ఉత్సాహపరిచారు.
ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు గాలిమూటి దేవప్రసాద్, రాష్ట్ర స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, దర్శి, దొనకొండ ఎంపీపీలు గోళ్ళపాటి సుధారాణి, బొరిగొర్ల ఉషారాణి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, గోళ్ళ పాటి మోషె, డేవిడ్ ఆర్సన్, జి. ఏసు దాసు, జి. కృపానందం, ఎన్. ఏసన్న, కె. దానియేల్ పాల్, రాచపూడి మిరియాన్, శ్రీరామ్ ఏసుబాబు, బం డి మార్క్, షేక్ ఖాశీం, జి. రాజారత్నం పాల్గొన్నారు.




