సమస్యలు పరిష్కరించకుంటే అంగన్వాడీల ఆందోళన మరింత ఉధృతం

డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళ న గురువారం ఉ ధృతంగా మారింది. పోలీసులు ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలుపట్టువిడవకుండా భీష్మించారు. ఆ సమయంలో సీఐటీయూ నాయకులకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ముందుగా అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూఆధ్వర్యంలో దర్శి పట్టణంలో నిరసన ర్యాలీచేశారు. అనంతరం గడియార స్తంభంసెంటర్ లో బైఠాయించి ధర్నాకు దిగారు.కొద్దిసేపటికి పోలీసులు అక్కడకు వచ్చిధర్నాకు అనుమతి లేదని వెంటనే వెళ్లిపోవాలని ఎస్ఐ రామకృష్ణ స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్య వహరిస్తేఅరెస్టులు చేస్తామని తెలిపారు. దీంతోసీఐటీయూ నాయకులు సందు వెంకటేశ్వర రావు, టీరంగారావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో పోలీసులు, సీఐ
టీయూ నాయకులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావర ణంఏర్పడింది. పోలీసులు సమయనం పాటించి ట్రాఫిక్
అంతరాయం లేకుండా ఆందోళన చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు వెంకటే
శ్వరరావు, రంగారావు మాట్లాడుతూ… న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్యకర్తలు సీఐటీయూ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించడం దారుణమన్నారు. ప్రభుత్వంఎన్ని బెదిరింపులు చేసినా ఇచ్చిన హమీలు నెరవేర్చే వ
రకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇంకామొండి వైఖరి అవలంబిస్తే ప్ర భుత్వ కార్యాలయాలనుదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోఅంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ నాయకురాళ్లు అచ్చమాంబ, అజిత, పద్మావతి, ప్రశాంతి, కె బాలమ్మ,
శ్యామల, ఫాతిమా, సుజాత, సీఐటీయూ నాయకులు
రంగనాయకులు, అంజిబాబు, నారాయణ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *