తూర్పు గంగవరంలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్

తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాలప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అరుణ కుమారి, పి ఎం సి చైర్మన్ టి రాజశేఖర్ రెడ్డి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాలలో గల ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి విద్యార్థినీ విద్యార్థులచే తయారు చేయబడిన పలు ప్రాజెక్టులను ప్రదర్శనగా ఉంచారు. మండల విద్యాశాఖ అధికారులు జి సుబ్బయ్య మాట్లాడుతూ….. సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ద్వారావిద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీయవచ్చని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను గమనించిన విద్యార్థులు తమలోని తెలివితేటలను బయటకు తెచ్చి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారడానికి దోహదపడుతుందని అన్నారు. మండలంలోని విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో ప్రదర్శనగా ఉంచిన ప్రాజెక్టులను తిలకించారు. తాళ్లూరు మండలం సుధాకర్ రావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు, గంగవరం పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జగనన్న బైజూస్ ట్యాబ్లు పంపిణీ

అనంతరం జగనన్న బైజూస్ ట్యాబ్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అరుణ కుమారి పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బైజూస్ సంస్థ ద్వారా ట్యాబులను అందించి 8వ తరగతి విద్యార్థులకు నూతన సాంకేతికతతో విద్యాభ్యాసం చేసేటట్లు ఏర్పాట్లు చేశారన్నారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ టి రాజశేఖర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు జి సుబ్బయ్య, ఎల్ సుధాకర్ రావు, పాఠశాల సహ ఉపాధ్యా యులు నాగిరెడ్డి, ఇతర ఉపాధ్యా యులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *