రైతులకు ఎరువుల దుకాణదారులు నాణ్యమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు కోరారు. తూర్పుగంగవరంలోని వెంకటేశ్వర ట్రేడర్స్ ను మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణదారు లు స్టాక్ రిజిస్టర్లో రోజూ కొనుగోలు, అమ్మకాల విరాలను తప్పనిసరి గా నమోదు చేయాలన్నారు. అలా నమోదు చేయకుంటే చర్యలు తప్పవన్నారు. రసీదులపై సం తకం చేసి ఇవ్వాలన్నారు. దుకాణంలో ఉన్న 10-26-26, 20-20-0-13, డీఏపీ ఎరువుల శ్యాంపిల్స్ ను నాణ్యతా ప్రమా ణాల నిమిత్తం విశాఖ రీజనల్ కో డింగ్ సెంటర్ కు పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో నాగరాజు, దుకాణం డీలర్లు పాల్గొన్నారు.

