రాయితీపై అందిస్తున్న ఎరువుల యాజమాన్య పద్ధతిలో బాగంగా అన్ని రకాల ఎరువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు తెలిపారు. తూర్పుగంగవరంలో శుక్రవారం వరలక్ష్మి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ను ఆకస్మికంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలు శాంపిల్స్ తీసుకుని రీజినల్ కోడింగ్ సెంటర్ కు పంపారు. రైతులకు ఏ మాత్రం నష్టం కలిగినా ఉపేక్షించేది లేదని అన్నారు. ఎఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
