జగననన్న బైజ్యూస్ ట్యాబ్ ను విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని వక్తలు కోరారు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 8వ తరగతి విద్యార్థులకు ల్యాబ్ లను పంపిణీ చేసారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు అధ్యక్షతన సభను నిర్వహించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య , పీఎంసీ చైర్మన్ వై క్రిష్ణా రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత ఎస్ అంజి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ల్యాబ్ లను పంపిణీ చేసారు. సక్రమంగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి రావాలని దీవించారు. ఉపాధ్యాయులు సురేష్, వెంకటేశ్వర్లు, రవి, షేక్ అబ్దుల్ కరీం, ఆంజనేయులు, పోల బాబు, ప్రభాకర్ రావు, స్వరూప రాణి, నాగేశ్వ రమ్మ తదితరులు పాల్గొన్నారు.
