రైతు సుభిక్షంగా ఉంటే అందరూ సుభిక్షంగా ఉంటారని రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయమని అని జిల్లా జెడీఏ ఎస్ శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య ఎని రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయశాఖ, అనుబందా శాఖల సహకారంతో జాతీయ రైతు దినోత్సవం శనివారం ఎన్ జి రంగా భవన్ లో నిర్వహించారు. ఆచార్య ఎన్.జి రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడీఏ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయంలో చోటు చేసుకుంటున్న మార్పులపై రైతులు అవగాహనతో ముందుకు సాగాలని కోరారు. ఈ- క్రాప్ నమోదుపై అవగాహన కలిగి రబీలో సాగు చేసిన పంటలకు ఈ క్రాప నమోదు చేసుకోవాలని కోరారు. పంటల భీమా పథకంపై ఉన్న పలు సందేహాలను నివృత్తి చేసారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి వై గోపిచంద్, దర్శి కెవికే శాస్త్రవెత్త డాక్టర్ ఎం ఉష, ఎడీఏలు రమేష్ బాబు, ప్రభాకర్ రావు, వేలం నిర్వాహణాధికారి ఎ శ్రీనివాసరావు, పొగాకు బోర్డు మెంబర్ వర ప్రసాద్, రైతు సంఘ నాయకులు, సంఘ కార్యదర్శి నాగినేని అవనీంద్ర ప్రసాద్, చుండూరి రంగారావు, చంచు శేషయ్య, మండవ శ్రీనివాసరావులు భారత మాజీ ప్రధాన మంత్రి చౌదురి చరణ్ సింగ్ 121వ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. రైతులు సాగులో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆచార్య ఎని కంగా సంస్థ ఉపాధ్యక్షులు నామినేని మోహనరావు, నాదేండ్ల చంద్రశేఖర్ రావు, బొడపాటి కోటేశ్వరరావు, గుండవరపు కోటేశ్వరరావు, సభ్యులు పాల్గొని ముందుగా భారత మాజీ ప్రధాన మంత్రి చౌధురి చరణ్ సింగ్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.





