మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మృతి చెందిన పలు పశువులు, జీవాలకు సంబంధించిన వైఎస్సార్ పశువుల భీమా నగదును చెక్కులను శనివారం జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు రైతులకు అందించారు. దర్శి మండలం మారెడ్డి పల్లె, పొదిలి మండలం కొండాయ పాలెం, ఎస్ఎన్ పాడు మండలానికి చెందిన మట్టిపాడు, పొన్నలూరులకు చెందిన10 మంది పశు, జీవాల పోషకులకు అందించారు. ఆయా గ్రామాలలో 9 గొర్రెలు, ఒక గేదే, ఎద్దు, మూడు ఆవులకు సంబంధించి రూ. 2,18,000లు జీవాల పోషకులకు మంజూరు అయినట్లు పశుసంవర్థశాఖ జెడీ డాక్టర్ బేబి రాణి తెలిపారు.
