రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్గా ఐఎఎస్ అధికారిని నియమించి నాన్ గ్యాడ్యుయేట్ వెటర్నేరియన్స్ సమస్యలపై క్షున్నంగా అధ్యయనం చేసి న్యాయం చెయ్యాలని ఎపీ నాన్ గ్యాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ (ఎపి. ఎన్.జి.వి.ఎఫ్) రాష్ట్ర చైర్మన్ సేవా నాయక్ కోరారు, డిఎల్డీఏ సమావేశపు మందిరంలో ఆదివారం ఉమ్మడి జిల్లా నాన్ గ్యాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జిల్లా సంఘ చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగినది. సంఘ రాష్ట్ర చైర్మన్ సేవా నాయక్, జనరల్ సెక్రటరీ గోవిందరాజు, సెక్రటరీలు రామక్రిష్ణ, ప్రసాద్, రాఘవ, రాజమోహన్, రవిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర చైర్మన్ సేవా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో 3200 మంది పారా వెటర్నీరియన్స్ వివిధ కేటగిరిలలో ఏడు దశాబ్దాలుగా మూగ జీవాలకు సేవ చేస్తూ రైతులకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్నారని అన్నారు. నేడు పశుసంవర్ధశాఖలో డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అమరేంద్రకుమార్ పశువైద్యులుగా పనిచేసి వివిధ క్యాడర్లలో పనిచేసి ఒక అసోషియేషన్ను డాక్టర్ క్యాడర్ నుండి డైరెక్టర్ క్యాడర్ వరకు ఏర్పాటు చేసి ఆ సంఘానికి అధ్యక్షునిగా ఉంటూ వారికి మేలు చేసేలా పలు నిర్ణయాలు తీసుకుంటూ పారా వెటర్నేరియన్స్ ను చులకనగా చూస్తూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఏక పక్ష నిర్ణయాలు తీసుకుని క్లస్టర్ విధానం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న సీనియర్ పారావెర్నేరియన్స్ ను యానిమల్ హజబెండరీ అసిస్టెంట్ (ఎహెచ్ఎ) పోస్టుతో సమానంగా ఈ క్లస్టర్ విధానాన్ని రూపొందిస్తున్నారని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సీనియారిటి ఉన్న ఉద్యోగాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. లేని పశువులు ఉన్నట్లు చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతున్నారని అన్నారు. పశువైద్య సమాజిక వర్గాలకు కాపాడుకునే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
పశుసంవర్ధక శాఖలో క్రింది స్థాయి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ దగ్గర నుండి మిగిలిన అధికారులతో సహా డైరెక్టర్ వరకు బివిఎస్ (డాక్టర్) చదువుకున్న వ్యక్తులే ఉండటం వలన వారికే లబ్ధి చేకూరుతుందని అన్నారు. అదే శాఖలో దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ పారా వెర్నెరియన్స్ (విఏ, ఎల్ఎస్ఏ, జెవీఓ, విఎల్ఓ)లకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. అధిక వార్షిక కల పశుసంవర్ధక శాఖలో ఐఎఎస్ అధికారిణి రాష్ట్ర డైరెక్టర్గా నియమిస్తే తమ లాంటి వారు కష్టాలు చెప్పుకుంటే విని న్యాయం చేసే అవకాశం ఉందని సంఘ రాష్ట్ర నాయకులు ఆశాభావం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్, గోపి, క్రిష్ణాంజనేయులు, ఖాదర్ బాష, జిల్లా ఫెడరేషన్ సభ్యులు కోటేశ్వరరావు, రవికుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


