ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకోవటడం ద్వారా రైతులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం లభిస్తుందని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి తెలిపారు. ఇల పావులూరులో మండల మహిళా సమాఖ్య పాలక వర్గ సభ్యులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ప్రధాన పంట ఉల్లిలో అంతర పంటలు కంది, జొన్న ఏ గ్రేడ్ మోడల్ పరిశీలించి పాటిస్తున్న పద్ధతులకు ఇతరులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం గురించి పొదుపు సంఘాలకు తెలిపి మరింత సాగు పెరిగేలా కృషి చెయ్యాలని సూచించారు. సిబ్బంది మహేశ్వర రెడ్డి, బ్రహ్మయ్య, శ్రీరామ్, రాథ పాల్గొన్నారు.
