సమ్మెలో భాగంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డ్ లు, ఎస్.ఎం. ఎస్ లు పంపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు ఎ. తిరుపతమ్మ మాట్లాడారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటరమణ, సుజాత, అంజమ్మ, సుబ్బమ్మ, అనిత, నాగజ్యోతి, విశ్వవాణి, మల్లేశ్వరి, పద్మావతి, సందు వెంకటేశ్వరరావు, మోహన్ రావు, నారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



