తాళ్లూరు మండల కేంద్రంలో ఎంఆర్సీ భవన్లో శనివారం యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. తాళ్లూరు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, తాళ్లూరు ఎంఈఓ-2లు ముఖ్య అతిథులుగా పాల్గొని డైరీని ఆవిష్కరించారు. యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు ఐ. హనుమా రెడ్డి, అధ్యక్షులు నాగ రాజు, జిల్లా మహా సభ ప్రతినిథి జి కొండయ్య, నాయకులు స్వామి దాసు, శ్రీనివాస్, రమణా రెడ్డి, శివ రామి రెడ్డి, సి వెంకటేశ్వర్లు, ఖాసిం సాహేబ్ తదితరులు పాల్గొన్నారు.
