సేవకు ప్రతిరూపం వాసవి క్లబ్స్, సందర్భం ఏదైనా సేవగా మలుచుకుని కార్యక్రమం నిర్వహించడం వాసవిక్లబ్ సభ్యులకే చెల్లిందని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను చూసుకున్నట్లే తల్లిదండ్రులను చూసుకోవాలని అప్పుడే వృద్ధాశ్రమాలన్నీ తొలగిపోయి వసుదైక కుటుంబంగా మారిపోతుందని వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ 2024 సంవత్సర అధ్యక్షులు యేల్చూరి నగేష్ గుప్తా పేర్కొన్నారు.
వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు వక్కలగడ్డ నారాయణమూర్తి, వాసవి క్లబ్ మహిళా ఫెమినా సభ్యురాలు, పూర్వ జోన్ ఛైర్మన్ వక్కలగడ్డ పద్మజ దంపతుల 35వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమంలోని మాతృమూర్తులకు నిత్యవసర సరుకులు అందించారు.
ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఏల్చూరి నగేష్ గుప్తా మాట్లాడుతూ 2023 వ సంవత్సరం వాసవిక్లబ్స్ “వినయం – విజయం” పేరిట సేవా నామ సంవత్సరముగా కార్యక్రమాలు నిర్వహించాయని, బోర్న్ టు విన్ లక్ష్యంగా “బి పాజిటివ్ – బి క్రియేటివ్” తో ఈ 2024 సంవత్సరమును వైబ్రంట్ ఇయర్ గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమములో వివాహవార్షికోత్సవ దంపతులు వక్కలగడ్డ పద్మజ, నారాయణ మూర్తి దంపతులు, పూర్వ క్లబ్ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మరియు 2024 సం. క్లబ్ కార్యదర్శి భూమా శ్రీనివాసులు, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కసుకుర్తి కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.


