నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు అవసరమైన వివిధ రకాలు పదార్ధాలు, వస్తువులు, డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉండేందుకు వ్వాపారులు పోటా పోటీగా సిద్దం అయ్యారు. దీంతో నూతన సంవత్సర శోభ సంతరించుకున్నది. నూతన సంవత్సరానికి స్వాగతం పలకటానికి ఆత్మీయతను పంచుకోవటానికి కొందరు క్యాలెండర్లను, డైరీలు, గ్రీటింగ్స్ అందజేస్తుంటారు. గతంలో విద్యార్థులు, మధ్య తరగతి కుటుంబీకులు, ఉద్యోగులు తమ అనుకూలతను బట్టి గ్రీటింగ్ కార్డులు, డైరీలు, క్యాలేండర్లు కొనుగోలు చేస్తుంటారు.
వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యా సంస్థలు క్యాలెండర్లను ముద్రించి పంపిణీకి శ్రీకారం చుట్టాయి. సెల్ ఫోన్ విప్లవంతో ఎస్ఎంఎస్, వాట్సాప్, ఫోస్బుక్, ట్విట్టర్లు రావటంతో గ్రీటింగ్స్ కి కొంత గిరాకీ తగ్గింది. పలు రాజకీయ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపే ప్లక్సీలకు గిరాకీ పెరిగింది. వివిధ రకాలు డిజైన్ల క్యాలెండర్లు మార్కెట్లో ఉన్నాయి. పంచాంగం, తిథి, వార, నక్షత్రాల శుభ గడియలు పొందు పరచి ఉన్న క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. పలు దినపత్రికల సైతం ముందస్తుగానే నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేశారు .ప్యాకెట్ క్యాలెండర్లుకు గిరాకి ఉన్నాయి.
చెరగని జ్ఞాపకాలు …….
నూతన సంవత్సరం వస్తుందంటే చాలు విద్యార్థుల నుండి ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణుల వరకు అంతా డైరీల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో డైరీ ప్రాధన్యత పెరిగిపోయినది. తమ మధుర స్మతులను డైరీలో పొందు పరుచుకొని సమయం చిక్కినప్పుడు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోనేందుకు ఉపయోగించుకుంటారు. తమకు పర్సనల్ అసిస్టెంటుగా ఉపయోగపడుతున్న ప్రొఫేషనల్ డైరీ నిర్వహణకు అధికారుల ఆసక్తి చూపుతున్నారు. దైనందిక వ్యవహారాలను మరచిపోకుండా ఈ డైరీ గుర్తు చేస్తుంది. రోజు వారి కార్యక్రమాలే కాకుండా కుటుంబసభ్యుల, స్నేహితుల, బంధువుల వివాహాలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ఊరు ప్రయాణాలు, మీటింగ్ తేదీలను గుర్తుగా రాసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రణాళికతో కూడిన పనులు చేసేందుకు డైరీలు ఎంతో ఉపయోగకరం. 2023డైరీకి వీడ్కోలు పలికి 2024నూతన సంవత్సర డైరీకి అత్మీయ స్వాగతం పలకటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
గౌరవనీయులైన మీకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుపుకుంటూ
మీ జర్నలిస్ట్ డిజిటల్ మీడియా యాజమాన్యం

