ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రతి ఒక్కరికి అందేలా తగిన సూచనలు చెయ్యాలని వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ, ఆరోగ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సక్రమంగా సేవలు అందిస్తూ మందులు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని సీనియర్ సిటిజన్ కంచర్ల పిచ్చమ్మ కుటుంబ సభ్యులు అభినందించారు. వారి సేవలను అభినందిస్తూ ప్రాధమిక ఆరోగ్య సిబ్బంది కి, 104 సిబ్బందికి 56 మందికి స్వీట్ బాక్స్ ల ను కంచర్ల పిచ్చమ్మ కుటుంబ సభ్యులు అందించారు. ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు సక్రంగా వస్తుందని అందరూ ఆయా గ్రామాలలో ఉత్తమ సేవలు అందించి సీనియర్ సిటిజన్స్ దీవేనలను పొందాలని, అందుకు కంచర్ల పిచ్చమ్మకు అందిస్తున్న సేవలు ఆదర్శంగా తీసుకోవాలని వైద్యాధికారి సూచించారు. గత నాలుగేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా స్వీట్స్ అందిస్తున్నట్లు కంచర్ల పిచ్చమ్మ కుమారుడు ఎబీసీ హైస్కూల్ డైరెక్టర్ కె. కాలేషాబాబు తెలిపారు.

