అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం ప రామర్శించారు. మాధవరం లో వెంకట్రావు ఇద్దరు కుమారులు వింత వ్యాధితో నడవలేని స్థితిలో ఉండగా వారిని పరామర్శించారు. చికిత్స చేయించేందుకు స్థోమతలేక ఇబ్బందులుపడుతున్నామని కుటుంబ సభ్యు లు ఆవేదన చెందారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి వైద్యం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తన వంతుగా రూ.25వేల సాయం అందజేశారు. మాధవరంలో దివ్యాంగుడైన కొడిమెల సుబ్బయ్య తనకు మూడు చక్రాల సైకిల్ ను మంజూరు జేయాలని కోరగా అందజేస్తామన్నారు. గ్రామంలో మానసిక దివ్యాంగులు సా యం చేయాలని కోరగా అందజేస్తామన్నారు. గ్రామంలో వైసీపీ నేత సోము శివారెడ్డి తల్లి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ సీనియర్ నేత శివరాంపురం గ్రామ ఉపసర్పంచ్ నారిపెద్ది రామ్మూర్తి తల సంబంధమైన ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్దే చికిత్స పొందుతుండగా పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో మాజీ ఎంపీపీలు పో శం మధుసూదన్ రెడ్డి , కోటరామిరెడ్డి, జి.మోషే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, తూము.పెద్ది రెడ్డి ,సర్పంచ్ చిమట సుబ్బారావు, మాజీ సర్పంచ్ కోట పెద్దిరెడ్డి, వెంకటేశ్వర్లు, జక్కుల రామకృష్ణ పాల్గొన్నారు.


