హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ కు సంబంధించి కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర చట్ట సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఆయిల్ ట్యాంకర్లు యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు.
