- నెమ్మాని సీతారామ మూర్తి
- ఘనంగా తితిదే ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆద్వర్యములో తిరుప్పావై ప్రవచనాలు.
సంతపేట సాయి మందిరంలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుప్పావై మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి గురువారం 19వ పాశుర ప్రాధాన్యం వివరించారు.
అర్థ పంచక జ్ఞానం గురించి తెలిపారు. వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, ఆగమములు, దివ్య ప్రబంధములు అనేటటువంటి ఐదు దీపముల ద్వారా శ్రీ లక్ష్మీ నారాయణులను గుర్తించవచ్చు అని తెలిపారు. భక్తి జ్ఞానానికి సిద్ధాంజనం లాంటిది అని పేర్కొన్నారు. భగవంతుడికి మనకి సంబంధం ఏమిటి, ఆయన్ను పొందాలి అంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనే విషయాలను వివరించారు.
గోదాదేవి తిరుప్పావై ద్వారా వేదాంత విషయాలను విపులంగా సమాజానికి అందించిందన్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పారాయణాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అళహరి చెంచలరావు, భక్త బృంద ప్రతినిధి దామచర్ల లక్ష్మీ ప్రసన్నకుమారి, ప్రధాన అర్చకులు శంకరమంచి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


