ఈ నెల 22న అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఒంగోలు నగరంలోని సీతారాంపురం, సీతారాంపురం నివాసి అయిన ధనిశెట్టి రాము&పావని దంపతులు స్వీకరించి స్థానిక సీతారాంపురం లోని ఉన్న సాయి సత్సంగ మందిరం నుండి మహిళా మూర్తుల ద్వారా ప్రతి ఒక్క గృహమునకు, అయోధ్య అక్షతలను, అయోధ్య రాముల వారి గుడి యొక్క చిత్రమును, మరియు అక్షింతలను ఎలా వాడాలి కరపత్రమును ప్రతి ఒక గృహమునకు పంపిణీ చేసి, వాటిని వివరంగా తెలియ చేయడం జరిగినది . సీతా రామపురం లోని జంధ్యం రాధ రమణ గుప్తా &రాధ దేవి దంపతులకు మొదటగా అంద చేసి, అక్కడ నుండి ప్రతి గృహమనకు స్వామి వారి అక్షతలు అంద చేయడం జరిగింది.
కార్యక్రమంలో ధనిశెట్టి పావని, తీగల సత్యవతి, భువనేశ్వరి, ఇంకొల్లు లక్ష్మి, ఇంకొల్లు అనురాధ, శ్రీదేవి, అమూల్య, తెనాలి ప్రసన్న, సంధ్య రాణి, శేషమ్మ, తదితరులు పాల్గొన్నారు.

