రూ. 20 వేలు లంచం తీసుకుంటూ దర్శి ఎస్ఐ డి. రామకృష్ణ ఏసీబీకి గురు వారం పట్టుబడ్డారు. ఏసీబీ నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శికి చెందిన గ్రా అడ్వకేట్ శేషం రమణయ్య, చిన్న రమణయ్య, వీరి తండ్రి వెంకటేశ్వర్లు ఒక మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. శేషం రమణయ్య, చిన్న రమణయ్య లను రౌడీషీట్లో చేర్చారు. గత నెల 14న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో రౌడీషీట్లను క్లోజ్ చేయాలని రమణయ్య కౌంటర్ దాఖలు చేయగా కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్బి డీఎస్పీలకు ఫైల్ పెట్టాలి. దానికి ఎస్ఐ రామకృష్ణ రూ.20 వేలు లంచం ఇస్తే చేస్తానని చెప్పడంతో ఈ నెల ఒకటిన ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
అధికారుల సూచన మేరకు రమణయ్య గురువారం ఎస్ఐ ఇస్తుండగా రామకృష్ణ లంచం ఏసీబీ అధికారులు రెడ్యోండెడ్గా పట్టుకున్నారు. శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. డీఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు ఎన్ఎస్ఎస్ అపర్ణ, శేషు, ఎస్సై ప్రసాద్ ఉన్నారు.

