ఉపాధ్యాయ ఎంఎల్సీ పి.చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైనది. విజయవాడ నుంచి వస్తుండగా కొడవలూరు మండలం రేగడిచలిక వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆయన పి.ఎ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆయన కు, గన్ మ్యాన్ కు తీవ్రగాయాలు అయ్యాయి. నెల్లూరు అపోలో వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రణాపాయం లేదని అపోలో వైద్యులు తెలిపారు.





