అయోధ్యలో ఈ నెల 22 వ తేదీన జరుగనున్న శ్రీ రామ విగ్రహ ప్రతిష్ట ను పురస్కరించుకుని బొల్లారం ఏ ఆర్ కే హోమ్స్ లో సభ్యులు అక్షింతలు ఇంటింటికీ పంపిణీ చేశారు.అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల కలశాన్ని తలపైన ధరించిన సభ్యులు ఇంటింటికీ వెళ్లి అక్షింతలను ప్రతి కుటుంబానికి అందజేశారు. ఈ అక్షింతలను 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఇంట్లో 5 దీపాలు వెలిగించి ఆ సమయం లో తలపైన ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో శ్రీనివాసరావు, మూర్తి ,అర్జున్ ప్రసాద్, గోపాలరావు , అరుంధతి , సీతా , వనిత , జ్యోతి, స్వప్నా తదితరులు పాల్గొన్నారు.
