అర్హలందరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నదే అని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరులో వైఎస్సార్ పెన్షన్ కానుకను శనివారం అందించారు. ఎంపీడీఓ కెవై కీర్తి అధ్యక్షతన సభను నిర్వహించి పెన్షన్ దారులకు పెరిగిన మూడు వేల రూపాయల పెన్షన్ను అందించారు. సర్పంచి మేకల చార్లేస్ సర్జన్, గ్రామ కార్యదర్శి లక్ష్మి కాంత్ తదితరులు పాల్గొన్నారు.


