లలిత కళల ద్వారా సమాజ హితం కోసం కృషి చేస్తున్న అఖిల భారత సంస్థ సంస్కార భారతి అని ఒంగోలు శాఖ అధ్యక్షులు పత్తి రంగమన్నార్ అన్నారు.
ఈనెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సo, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులలో దేశభక్తి, దైవభక్తిని పెంపొందించే లక్ష్యంతో 21వ తేదీ ఆదివారం అంజయ్య రోడ్డులోని ఏకేవీకే (ఆంధ్రకేసరి) జూనియర్ కాలేజీ ఆవరణలో చిత్రలేఖనం పోటీలు, దేశభక్తి గీతాలు బృందగాన పోటీలు, కవితల రచన పోటీలు, శ్రీరాముని వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలకు సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రివర్యులు శిద్దా రాఘవరావు వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో వారిని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు, కోటి మాల్స్ అధినేత కోటి సూర్యనారాయణ, సంస్కార భారతి సంరక్షకులు చదివాది హనుమంతరావు, సృష్టి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తిమ్మిరి రవీంద్ర, ఎయిమ్స్ క్లబ్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్త జంధ్యం, ఆంజనేయ ప్రసాద్, షణ్ముఖ సాయి తదితరులు పాల్గొన్నారు. పోటీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం పత్తి శ్రీనివాసులు (9492123822) పప్పుల హరిప్రియ (7382707546) ను సంప్రదించవలసిందిగా కోరారు.

