సత్పలితాలను ఇస్తున్న నానో శక్తి, నానో డీఎపీ – తక్కువ ఖర్చుతో పంటలకు, రైతన్నలకు మేలు- నేరుగా అవసరమైన మొక్కలకు శక్తిని అందిస్తున్న నానో డీఎపీ – హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

నానో శక్తి, నానో డీఏపీ వాడుతున్న రైతులు మంచి ఫలితాలను పొందుతున్నారు. నవరత్న కంపెనీకి చెందిన వారు రైతులకు ఫలితాలను పరిశీలించేందుకు (డెమో) నిమిత్తం పలు చోట్ల రైతులకు జువారి ఫార్మా హబ్ నవరత్న కంపెనీకి చెందిన నానో శక్తి, నానో డీఏపీ ని అందించారు. దీంతో వాటిని తమ పైర్లకు వాడిన రైతులు మంచి ఫలితాలు ఇచ్చాయని రైతులు చెప్పారు. మిరప మొక్క ఎపుగా చక్కగా పెరిగటంతో పాటు శక్తి అంతా మొక్కకు మాత్రమే పట్టటంతో కలుపు కూడ తక్కువగా వచ్చిదని రైతులు తెలిపారు. పూత చాలా ఎక్కువగా చక్కగా రావటంతో పాటు కాయలు ఏపుగా పెరిగాయని చెప్పారు. మరింతగా మొత్తం పైరుకు నానో డీఎపీని వేయ్యాలని కంపెనీ వారికి అడుగగా ఇంకా అందుబాటులోనికి రాలేదని చెప్పారని అన్నారు. రైతులు అందరూ కూడ ఈ నానో డీఏపీ వాడకంతో ఎరువు బరువు(బస్తాలు) మొయ్యటం తప్పతుందని, అవసరమైన మేరకు పంటకు మాత్రమే బలం పట్టునని, ఎంతో చక్కగా ఉపయోగపడినదని రైతులు తమ అభిప్రాయాలు కంపెనీ ప్రతినిధులు ఎస్ఎండీ రఫీ, ఎంఓ పీవీ సుభాష్ వద్ద రైతులు గుంటూరు జిల్లా వట్టిచెరువు మండలం గారపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ శ్రీనివాసరావు, కె. నాగేశ్వరరావులు తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. అవకాశం ఇచ్చిన కంపెనీకి కృతజ్ఞతలు చెప్పారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *