తిరుప్పావై ఉత్సవాల సందర్భంగా మంగళవారం సంతపేట సాయిబాబా మందిరంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహిళలు అమ్మ గోదాదేవికి మంగళ నీరాజనాలు సమర్పించారు. 24వ పాశురాన్ని ఆలపిస్తూ మహిళలు అమ్మవారికి సామూహిక దీపారాధనతో మంగళాశాసనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి పాశురం ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు
అళహరి చెంచలరావు, భక్త బృంద ప్రతినిధి దామచర్ల లక్ష్మీ ప్రసన్న కుమారి, ప్రధాన అర్చకులు శంకరమంచి సుధాకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

