సిమెంట్ ఇటుకల తయారీ కేం ద్రంలో కంకర అన్లోడ్ చేసి రోడ్డెక్కుతున్న టిప్పర్.. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెం దాడు. ఈ సంఘటన మంగళ వారం తాళ్లూరు-తూర్పుగంగవరం మధ్య చోటుచేసు కుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన పగడాల రామకృష్ణ(26), అతని స్నేహితుడు పోలంరెడ్డి హర్ష వర్థన్రెడ్డితో కలిసి సంక్రాంతి సంర్భంగా చీమకుర్తి మం డలం పాటిమీదపాలెంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీ లకు మంగళవారం ఉదయం వెళ్లాడు. అక్కడ ఆట ముగిశాక తాళ్లూరులో చదువుకుంటున్న బాబాయి కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు తూర్పుగంగవరం మీదుగా తాళ్లూరు వెళ్తున్నారు. మార్గ మధ్యంలో బ్రిక్స్ యూనిట్ లో కంకర అన్లోడ్ చేసి రోడ్డు ఎక్కుతున్న టిప్పర్ వీరి బైక్ ను ఢీకొట్టింది. రామకృష్ణ లారీ టైర్ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్థన్ రెడ్డి ని స్థానికులు తూర్పుగంగ వరం పీహెచ్సీకి అతరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంరతం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. బొట్లపాలెం గ్రామానికి చెందిన పడగాల శ్రీనివాసరావు, సుబ్బులు దంపతులకు ఇద్దరు అమ్మా యిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిలో రామకృష్ణ, హరి కృష్ణ కవల పిల్లలు. హరికృష్ణకు గత ఏడాది వివాహం చేశారు. మృతుడు రామకృష్ణ డిగ్రీ పూర్తి చేసి బొట్లపా లెంలో వలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వైవీ రమణయ్య పరిశీలించి వివరాలు సేకరిం చారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తానని చెప్పారు.

