జగనన్న ఆశయాలకు కనుగుణంగా పనిచేస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంత జిల్లాగా తీర్చిదిద్దుతానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. తమ సేవా కార్యక్రమాలు, బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలు, ప్రజల ఆదరాభిమానాలతో తమకు మళ్లీ దర్శి టికెట్ కేటాయించారన్నారు. అందుకు ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గా ప్రకటించడంతో బూచేపల్లి నివా సానికి నాయకులు, అభిమానులు భారీగా చేరు కున్నారు. అభిమానులు కేరింతలతో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పైకి ఎత్తి తమ అభిమానాన్ని చూపించారు. శివప్రసాద్ రెడ్డి బావోద్వేగంతో మాట్లాడారు. ఆయన సతీమణి నందినీ నాయకులు, కార్యకర్తల అభిమానం చూసి ఆనందబాష్పాలు రాల్చారు. బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డిలు మాట్లా డుతూ పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని కూడా త్యజించి వైఎస్ జగన్మోహనరెడ్డి వెంట తిరిగామని గుర్తు చేశారు. వైస్సార్ సీపీని ఆదరించి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేని చేసి నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు. తనపై నమ్మకం వుంచి తనకు దర్శి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

