తూర్పుగంగవరంలో ప్రధాన ఆర్ అండ్ బి రోడ్లో కట్టెల లోడ్ అడ్డంగా పడిపోవటంతో ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బందికరంగా మారినది. దర్శి, చీమకుర్తి ప్రధాన రహదారిలో నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కట్టెల లోడ్ ప్రమాదవశాత్తు తిరుగబడటంతో రోడ్డు అడ్డంకిగా మారినది. దీన్ని తక్షణమే తొలగించి ఇబ్బందులు తొలగించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోక పోవటంపై ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
