తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడులో శుక్రవారం జగనన్న సురక్ష రెండవ విడుత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డిలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యులు మౌనిక, హైదవి, వినోద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొని 340 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఎంపీటీసీ బాల కోటయ్య, పీఎంసీ చైర్మన్ క్రిష్ణా రెడ్డి, సంగన యోగి రెడ్డి, రిటైర్డు హెచ్ఎం సన్నపు రెడ్డి అంజి రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

