వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టించి పని చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. మండలంలోని ఉమామహేశ్వరపురం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాల్మీకి బిసి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాటకచేరి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాట కచేరిని ప్రారంభించిన అనంతరం జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరాభిమానాలతో ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టాల్లో తమ కుటుంబం పాలుపంచుకుంటుందని అన్నారు. కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి మరో మారు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దర్శి మాజీ ఎమ్మెల్యే, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి, పార్టీలకు కుల మతాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలుఅందించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో విజయవాడలో ప్రతిష్టాత్మకంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని
ఏర్పాటు చేసి సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు కేవలం సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబం పై నమ్మకంతో దర్శి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలందరూ ఐక్యంగా కృషిచేసి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టి దర్శి ఎమ్మెల్యేగా తనను గెలిపించుకోవాలని కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాల్మీకి బీసీ సంఘం వారికి అభినందనలు తెలిపారు. ముందుగా వాల్మీకి బీసీ సంఘం సభ్యులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కు, దర్శి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లకు గ్రామ ప్రారంభం నుండి గ్రామ నడిబొడ్డులో స్టేజి వద్దకు అడుగడుగున పూలమాలలతో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ సీనియర్ నాయకులు బీరం కొండారెడ్డి, చింతల కోటిరెడ్డి లను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, జిల్లా సర్పంచ్ లా సంఘం మాజీ ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ వేముల పద్మ జానకి రామయ్య, గ్రామ సర్పంచి వేముల పద్మ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, పసుపు గల ఉపసర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, మారేళ్ల సర్పంచి గోపన బోయిన వెంకటేశ్వర్లు , గోపన బోయిన శ్రీనివాసరావు ,వైసీపీ సీనియర్ నాయకులు మేదరమెట్ల కోదండరామయ్య, మాజీ ఎంపీటీసీ గుజ్జుల శ్రీనివాసరావు ,చింతల కృష్ణారెడ్డి, మండల వైసీపీ యూత్ అధ్యక్షులు మందలపు అశోక్, నంబూరి గురవయ్య, నంబూరు సామేలు, పాలడుగు చిరంజీవి( మాజీ సైనికుడు) తదితరులు పాల్గొన్నారు.



