అయోధ్యలో రామ మందిరంలో ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేవాలయాలు అన్నింటిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు, పార్టీ రాష్ట్ర | అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు స్వచ్చ తీర్ధ నిర్వహించాలని బిజేపి జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి అన్నారు. ప్రతి దేవాలయంలో ఐదు దీపాలు వెలిగించి రామ మందిరాలల్లో భజనలు నిర్వహించి శ్రీరామ నామ జపం చెయ్యాలని చెప్పారు. గాంధీనగర్ లో ఉన్న రామాలయంలో స్వచ్చ తీర్థ కార్యక్రమం నిర్వహించారు. మహిళా కార్యకర్తలు శేషమ్మ, కుమారి, పద్మావతి, రమ, రాణి తదితరులు పాల్గొన్నారు.

