దరిశి లో అంగన్ వాడీల సమ్మె 41వ రోజు

దరిశి ప్రాజెక్టు పరిధి లోని అంగన్ వాడీ కార్యకర్తలు , అయా లు వేతనాలు పెంచాలని చేస్తున్న సమ్మె 41వ రోజు చేరిందని , అయినా ముఖ్యమంత్రి మొండిగా ఉండటం మంచిది కాదని , రాభోవు ఎన్నికలలో బుద్ది చెప్పే విధంగా చేస్తామని సిఐటియు దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. ఈ సమ్మెలో అంగన్ వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలపగా , సిఐటియు , రైతు , DYFI నాయకులు ఉప్పుటూరి నాగరాజు , సందు వెంకటేశ్వరరావు , ఈమని నాగేశ్వరరావు , గోగు వెంకయ్య , రంగనాయకులు , తిరపతమ్మ, విజయమ్మ, అజితా కుమారి , నాగమణి, బాలమ్మ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంగన్ వాడీల సమ్మె విజయవాడ ధర్నాకి వెళ్ళవద్దని ప్రభుత్వం పోలీసుల ద్వారా నోటీసులు ఇస్తున్నారు. ఇది అన్యాయం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి వేతనాలు పెంచుతామని అమలు చేయలేదని అందుకే సమ్మె 41 రోజులుగా కొనసాగుతుందని, వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సిఐటియు దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు , సందు వెంకటేశ్వరరావు అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *