భారత రాజ్యాంగo లో భారత ప్రజలకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలను బావ ప్రకటన లోను, lవిశ్వాసములో ను , నమ్మకములోను, ఆరాధన లోను స్వేచ్ఛను ప్రజలందరికీ సమానంగా ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని గురించి విద్యార్థిని, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కో-ఆర్డినేటర్ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన తాళ్లూరు మండలం లక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రాజ్యాంగ ప్రవేశిక ముఖ్యాంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వి రమణ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు, పెంపొందించుకొని విద్యార్థి, విద్యార్థులు భారత రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు. డి.బి.ఆర్.సి రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 17 మరియు 21 ఆర్టికల్ పై ఏ ఒక్కరి పైన కులం, మతం, వైకల్యం పేరుతో వివక్ష చూపరాదని అందరికి సమానం అవకాశాలు కల్పించాలని పేర్కొన్నదని ఆయన అన్నారు. సాంఘిక శాస్త్రo ఉపాధ్యాయుడు జి. పూర్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాల లోపు బాలలు 42 హక్కులు పొందడం జరిగిందని వాటిలో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కులుగా వర్గీకరించడం జరిగినది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకాయమ్మ, కోటేశ్వరరావు, మనోజ్ కుమార్, ఎం చిరంజీవి,నాగమణి పాల్గొన్నారు. తదుపరి రాజ్యాంగ విశిష్టత పై జరిగిన ఫోటో ఎగ్జిబిషన్ ను విద్యార్థిని, విద్యార్థులకు తిలకించారు,

