వైఎస్సార్ ఆసరా విజయవంతంగా నిర్వహించాలి – జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మని సత్కరించిన అధికారులు

జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే వైఎస్సార్ ఆసరా పథకాన్ని విజయ వంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సూచించారు. దర్శి లోని బూచేపల్లి నివాసంలో ఎంపీడీఓ, ఏపీఎం, సీసీలతో వారు సోమవారం సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ… వైఎస్సార్ ఆసరా పథకం పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని చెప్పారు. మూడు విడతలు పూర్తి చేసుకుని నాలుగో విడత రుణమాఫీని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నేడు నగదు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. నగర పంచాయతీ కమిషనర్ మహేష్, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు ఎంపీడీఓలు హనుమంతరావు, కుసుమకుమారి, యుగకీర్తి, శంకరరావు, ఏపీఎంలు విజయకుమారి, గుడిమెట్ల వెంకటేశ్వర్లు, దేవరాజు, హనుమంత రావు, సీసీలు బ్రహ్మయ్య, ఫణిబాబు, కోటేశ్వర రావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *