ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధ్యానం కొనుగోలు చేస్తుందని ఖరీఫ్ 2023-24కు సంబందించి భారత ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని మాత్రమే రైతుల వద్ద నుండి కొనుగోలు చేయబడునని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు లోని రైతు భరోసా కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రాల కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర క్వింటాలకు సాధారణ రకం రూ.2183లు కాగా గ్రేడ్-ఏ రకం క్వింటాలకు రూ.2203లను మద్దతు ధర పొందుటకు కేంద్ర ప్రభుత్వం వారు అనుమతించిన నాణ్యతా ప్రమాణాలను బట్టి ఉండాలని వ్యవసాయ అధికారి చెప్పారు. ఈ క్రాప్ నమోదు చేసుకొని ఈకేవైసీ పూర్తయిన రైతులు, ధాన్యం విక్రయించుటకు సిద్ధమైన రైతుల నుండి మాత్రమే కొనుగోలు చేస్తారన్నారు. రైతులకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే అదనంగా వస్తుంటే నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చని తెలిపారు. ఆర్బీకేల ద్వారా అమ్ముకొనదలచుకుంటే గోనె సంచులు, హమాలీ ఛార్జీలు, ట్రాన్స్ ఫోర్టు ఛార్జీలు ప్రభుత్వమే భరించి 21 పనిదినాల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయబడుతుందని తెలిపారు. అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏ నాగరాజు నాయక్, రైతులు పాల్గొన్నారు.
