అంగన్ వాడీల సమ్మె సంఘటితంగా పోరాడితేనే విజయాలు వస్తాయని 42 రోజుల సమ్మె నిరూపణ చేసిందని సిఐటియు దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు.
దరిశి ICDS ఆఫీసు వద్ద యూనియన్ అధ్యక్షరాలు ఎ.తిరపతమ్మ అధ్యక్షతన దరిశి గడియారం స్థంభం వద్ద టపాసులు పేల్చీ , మిఠాయిలు పంచుకుని విజయోత్సవ ప్రదర్శన జరిపుకున్నారు. , ఆయన మాట్లాడుతూ 42 రోజులపాటు సమ్మెని కొనసాగించడానికి కృషి చేసిన ప్రజా సంఘాలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. హక్కుల కోసం కార్మికులు ,ఉద్యోగులు పోరాటాలు చేస్తేనే హక్కులు వస్తాయని , అందుకోసం ఐక్యంగా పోరాడి విజయం సాధించిన అంగన్ వాడీలు రాష్ట్రంలోని అన్ని తరగతుల పోరాడే శక్తులకు స్పూర్తి గా ఉంటాయని అన్నారు.
ఈ సభలో ప్రజా సంఘాల నాయకులు కె.హానుమంతరావు , బోడపాటి హనుమంతరావు, వి.ఆంజనేయులు , DYFI జిల్లా కార్యదర్శి కె.ఎఫ్ బాబు , దళిత , బిసి సంఘాల నాయకులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ , నాగమణి , అన్నవరపు వెంకటేశ్వరరావు , బాలమ్మ , ఫాతిమా, ప్రశాంతి , పాల్గొన్నారు.



